Breaking

Friday, October 15, 2021

మా కాలేజీలో ఎన్ సి సి కేడెట్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగినది ? మరియు ఎన్ సి సి కేడెట్ గా

 మా కాలేజీలో ఎన్ సి సి కేడెట్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగినది ? మరియు ఎన్ సి సి కేడెట్ గా

 నా సెలక్షన్ ఏ విధంగా జరిగినది ? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు వివరించ బోతున్నాను.. NCC COLONEL


 🏢 డిగ్రీ జాయిన్ అవడం :
        ---------------------------
 నేను 2018 లో డిగ్రీ మొదటి సంవత్సరం
 ఎస్ ఆర్ డి సి కాలేజీలో జాయిన్ అయ్యాను, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది మరియు క్లాసెస్ జరుగుతున్నాయి.

📢 ఎన్ సి సి నోటిఫికేషన్ విడుదల అవటం :
      ----------------------------------------------------
అప్పుడు సెప్టెంబర్ లో, మా క్లాస్ కి ఒక సర్క్యులర్ వచ్చింది, 27 ఎన్ సి సి కేడెట్స్ కొరకు నోటిఫికేషన్ వచ్చింది., ఎన్సిసి జాయిన్ అవ్వాలనుకునేవారు సెలక్షన్ ప్రాసెస్ కి అటెండ్ అవ్వండి అని చెప్పారు.,


🏟️ సెలక్షన్ ప్రాసెస్ : 
      ------------------
పీజీ గ్రౌండ్ లో ఎన్సిసి సెలక్షన్స్ జరిగాయి, 10:30 కి సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది, ఈ సెలక్షన్ కి 700 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, ఎన్ సి సి కేడేట్స్ ని సెలెక్ట్ చేయడానికి, ఆర్మీ సాబ్స్ వచ్చారు., మరియు సీనియర్ ఎన్ సి సి కెడెట్స్, సెలక్షన్ కి వచ్చిన స్టూడెంట్స్ ని గ్రూప్ వైజ్ గా నిల్చోబెట్టారు., తరువాత ఆర్మీ సాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు...

✋ హ్యాండ్స్ చెకింగ్ :
      ---------------------
సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ముందుగా హ్యాండ్స్
 చెక్ చేశారు, హ్యాండ్స్ క్రాస్ గా ఉన్న వారిని డిస్క్వాలిఫై చేశారు, చేతులు చాచినప్పుడు రెండు ఎల్ బోస్ అతుక్కున్న వారిని డిస్క్వాలిఫై చేశారు, 
ఫిన్గర్స్ మధ్య గ్యాప్ లేకుండా మరియు
 హ్యాండ్స్ స్ట్రైట్ గా ఉన్న స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశారు...

🎤 తరువాత మైక్ లో ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చారు...

➡️ సర్జరీస్ అయి ఉన్న వారు మరియు
➡️ ఎముకలు విరిగిన లేదా ఫ్రాక్చర్స్ అయినవరు
➡️ మరియు ఐ సైట్ ఉన్నవారు మరియు 
➡️ టాటూస్ ఉన్నవారు మరియు
➡️ కాలిన గాయాలు ఉన్నవారు మరియు 
➡️ హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్నవారు,
గ్రూపులో నుంచి బయటకు రావలసిందిగా అనౌన్స్ చేశారు., మరియు వారిని డిస్క్వాలిఫై చేయటం జరిగింది...

👬 తరువాత లెగ్స్ చెక్ చేయటం జరిగింది, లెగ్స్ క్రాస్ గా ఉన్న వారిని డిస్క్వాలిఫై చేశారు, నిలబడినప్పుడు రెండు మోకాళ్ళు టచ్ అవ్వకుండా, లెగ్ స్ట్రైట్ గా ఉండి, నిలబడి నప్పుడు, రెండు కాళ్ల మధ్య గ్యాప్ ఉన్నవారిని సెలక్ట్ చేశారు...

📏 తరువాత హైట్ చెక్ చేయడం జరిగింది,
 157 సెం.మీ. నుంచి అబొవ్ 163 సెం. మీ. ఉన్నవారిని సెలెక్ట్ చేశారు...

తరువాత సెలెక్ట్ చేసిన వారిని 4 గ్రూప్స్ గా డివైడ్ చేశారు, ఒక్కొక్క గ్రూపులో 50 స్టూడెంట్స్ ఉన్నారు, 
ఒక గ్రూపు తర్వాత మరొక గ్రూపు కి రన్నింగ్ నిర్వహించారు, 

 రన్నింగ్ 400 మీటర్స్ ట్రాక్ లో నిర్వహించారు,
400 మీటర్స్ ట్రాక్ లో 2 రౌండ్స్ వేయించారు., 
ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారిని సెలెక్ట్ చేశారు.

సెలక్షన్స్ కి మొత్తం 700 స్టూడెంట్స్ వచ్చారు., 
అయితే రన్నింగ్ జరగడానికి ముందే,
 500 స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అయ్యారు, 
రన్నింగ్ కి 200 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు,
చివరిగా 12 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశారు, 
మరియు 10 స్టూడెంట్స్ ని రిజర్వు లో ఉంచారు.,

( మరో పది మంది స్టూడెంట్స్ ని రిజర్వులో ఉంచడానికి కారణం ఏమిటంటే, ఎన్ సి సి లో జాయిన్ అయిన వారందరూ ఎన్సిసి లో లాస్ట్ వరకు కొనసాగరు,
కొందరు ఎన్సీసీ ట్రైనింగ్ తట్టుకోలేక మధ్యలోనే
 డ్రాప్ అవుట్ అవుతారు, ఈ విధంగా ఏర్పడిన ఖాళీలను రిజర్వ్ లో ఉంచిన వారి చేత భర్తీ చేస్తారు.)

" రన్నింగ్ నిర్వహించినప్పుడు నేను మొదటి గ్రూప్ లోనే ఉన్నాను, నేను థర్డ్ రావడం జరిగింది" ...

✍️📄 ఎన్ సి సి జాయినింగ్ ఫామ్ ఫిలప్ చేయటం :
             ----------------------- ----------------------------

తరువాత సెలెక్ట్ అయిన మా చేత, 
జాయినింగ్ ఫామ్ ఫిలప్ చేయించారు...

💵 ₹ ఫీజు :
 --------------    
ఎన్సిసి జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం రాలేదు కానీ జాయినింగ్ ఫారం కొరకు పది రూపాయలు చెల్లించాను.

📄 ఎన్ సిసి జాయినింగ్ ఫామ్ లో మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేయవలసి ఉంటుంది,

🔘 పేరు
🔘 నాన్న పేరు
🔘 ఇంటి చిరునామా
🔘 ఫోన్ నెంబర్
🔘 మరికొన్ని తదితర వివరాలు రాయవలసి ఉంటుంది... మరియు ప్రిన్సిపాల్ గారి చేత సంతకం చేయించాను...

🗒️ తరువాత నేను సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ :
     ----------------- ----------------- ---------- --------------

🔥 ఆధార్ కార్డు
🔥 పదవ తరగతి మార్కు లిస్ట్
🔥 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 
🔥 అడ్మిషన్ నెంబర్

ఈ విధంగా ఎన్ సి సి లో నా సెలక్షన్ ప్రాసెస్ జరిగింది,
ఈ విధంగా మా కాలేజీలో ఎన్ సి సి కేడెట్స్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తయింది.

 🧐 మరొక ముఖ్యమైన విషయం : 
    -----------------------------------------
సాధారణంగా చాలా వరకు బెటాలియన్ లలో 
ఎన్ సి సి కేడెట్స్ సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ,
ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ పూర్తయిన తర్వాత
రిటన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది ...

🧑🧕 ఎన్ సి సి కేడెట్స్ సెలక్షన్ ప్రాసెస్,
గర్ల్స్ మరియు బాయ్స్ కి ఒకే విధంగా ఉంటుంది.

ఈ సంత్సరం ఎన్సిసి జాయిన్ అవ బోయే వారికి నా సలహాలు.:

నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అంటే,
ఎన్సిసి సెలక్షన్ ప్రాసెస్ లో రన్నింగ్ అనేది కీలక మైన పాత్ర పోషిస్తుంది, కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ కిి రెండు నెలల ముందు నుంచే రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి.

⚔️ ఎన్ సి సి లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు దాదాపుగా ఆర్మీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటారు,

 నేను కొంతమంది స్టూడెంట్స్ ని గమనించాను...
🚫 హ్యాండ్స్ క్రాస్ గా ఉన్నాయని,
🚫 లెగ్స్ క్రాస్ గా ఉన్నాయని,
🚫 ఐ సైటు ఉందని,
🚫 మరియు ఇతర కారణాల చేత

ఎన్సిసి జాయిన్ అవ్వాలని కోరిక ఉన్నా,
సెలక్షన్స్ కి వెళ్ళకుండా give up చేస్తారు.,
 మీరు కూడా ఇలాగే భావిస్తూ ఉన్నట్లయితే,
ఈ లోపాలను సరిదిద్దుకోవడానికి, తగినటువంటి ఎక్సర్సైజెస్ అందుబాటులో ఉన్నాయి, వైద్యుడిని సంప్రదించండి, సెలక్షన్ ప్రాసెస్ కి ఆరు నెలల ముందే ఈ ప్రయత్నం చేయండి...
మీరు ఎన్ సి సి కి ఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది.

👉 మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే :
      -----------------------------------------------------
 ఎన్ సి సి లో త్రీ వింగ్స్ ఉంటాయి.,
అవి 
⚔️ ఎన్ సి సి ఆర్మీ వింగ్ 
⚓ ఎన్ సి సి నావల్ వింగ్
🛩️ ఎన్ సి సి ఎయిర్ఫోర్స్ వింగ్ 
ఈ మూడు వింగ్ ల లోను సెలక్షన్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది.

మీకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాలని కోరిక ఉన్నట్లయితే ఎన్ సి సి ఆర్మీ వింగ్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఇండియన్ నేవీ లో ఉద్యోగం సాధించాలని కోరిక ఉన్నట్లయితే ఎన్ సి సి నేవల్ వింగ్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సాధించాలని కోరిక ఉన్నట్లయితే ఎన్ సి సి 
ఎయిర్ ఫోర్స్ వింగ్ లో జాయిన్ అవ్వండి.

🤔 ఎన్ సి సి లో జాయిన్ అయిన తర్వాత :
      ------------------------ ----------------------------
 నేను ఎన్సిసి జాయిన్ అయిన తర్వాత
నాకు కెడెట్ ర్యాంక్ ఇవ్వబడింది,
ఎన్ సి సి ఫస్ట్ క్లాస్ లో ఎన్ సి సి గురించి ఇంట్రడక్షన్ క్లాస్ జరిగింది.
ఎన్ సి సి క్లాసెస్ వారానికి 4 క్లాసెస్ జరిగేటివి,
ఎన్ సి సి క్లాసెస్ లలో భాగంగా, 
గ్రౌన్డ్ క్లాసులో డ్రిల్ నేర్పేవారు,
థియరీ క్లాసులో థియరీ నేర్పేవారు ,
ఈ క్లాసెస్ అన్ని సీనియర్స్ నిర్వహించేవారు.,

⛺ క్యాంపులు :
      -----------
  మే నెలలో మేము క్యాంపు కి వెళ్ళాము,
ఈ క్యాంపు పది రోజులు జరిగింది, ఈ క్యాంపు లో నే,
ఐ డి ఎస్ సీ సెలక్షన్స్,
టి ఎస్ సి క్యాంప్ సెలక్షన్స్
ఆర్ డి సి క్యాంప్ సెలక్షన్స్ జరిగాయి,

  ఆర్ డి సి కి సెలెక్ట్ అయిన వారు, డిసెంబర్ చివరి వారంలో ఢిల్లీ వెళ్లారు, నేను ఆర్ డి సి కి సెలెక్ట్ అవ్వలేదు, ఈ సెలక్షన్ ప్రాసెస్ లో, నేను హైట్ విషయంలో డిస్ క్వాలిఫై అయ్యాను.

📋 బి సర్టిఫికెట్ ఎగ్జామ్:
       ------------------------
తరువాత సెకండ్ ఇయర్ లో బీ సర్టిఫికెట్ ఎగ్జామ్ జరిగింది, ఇందులో నాకు బి గ్రేడ్ వచ్చింది, 
ఆ తరువాత మా కాలేజ్ ఎన్ సి సి ఎ ఎన్ ఓ సార్ 
బీ సర్టిఫికెట్ ఎగ్జామ్ లో ఏ గ్రేడ్ వచ్చిన రవీంద్ర కి
 ఎస్ యూ ఓ ర్యాంక్ ఇచ్చారు ,
మా కాలేజీలో బి సర్టిఫికెట్ ఎగ్జామ్ లో ఏ గ్రేడ్ ఒకరికి మాత్రమే వచ్చింది ,
బి గ్రేడ్ ఇద్దరికీ వచ్చింది అందులో నేను ఒకడిని,
మా ఇద్దరికీ జే యూ ఓ ర్యాంక్ ఇవ్వబడింది.,

కరోనా :
---------
మేము ఫైనల్ ఇయర్లో ఉండగానే కరోనా వచ్చింది,
సో మేము జూనియర్స్ కి నేర్పించింది చాలా చాలా తక్కువ, యూట్యూబ్ ఛానల్ ద్వారా జూనియర్స్ కి కొంత నేర్పించే ప్రయత్నం చేయడం జరిగింది.

 📋 సి సర్టిఫికెట్ ఎగ్జామ్ :
        -------------------------
2021 మార్చి నెలలో సి సర్టిఫికెట్ ఎగ్జామ్ రాయడం జరిగినది, రిజల్ట్స్ ఇంకా రాలేదు...

ముగింపు :
------------
ఈ వ్యాసం ద్వారా ఎన్ సి సి కి సంబంధించి 
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ను మరియు నా వ్యక్తిగత అభిప్రాయాలను మీకు వివరించే ప్రయత్నం చేశాను.

                     కృతజ్ఞతలు..

No comments:

Post a Comment