బ్లాగర్స్ డౌట్స్ పార్ట్ -1
బ్లాగింగ్ సందేహాలు (blogging doubts ):
బ్లాగ్ లో పోస్ట్ రాయడం ఎలా:
1)ఒక పోస్ట్ లో ఎన్ని వర్డ్స్ ఉండాలి అంటే కనీసం మీరు 500 వర్డ్స్ వచ్చేటట్లు చూసుకోండి అంత కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి.
2)మీ కంటెంట్ అనేది హెడ్డింగ్ ,సబ్ హెడ్డింగ్స్ మరియు పేరాగ్రాఫ్ లతో ఉండి యూసర్ కి సులువుగా అర్ధం అయ్యేటట్లు ఉండాలి.
3)కాపీ రైట్ ఫ్రీ ఇమేజ్ లను unsplash ,పిక్సబే ,ఫ్రీపిక్,పిక్సల్స్ .కమ్ ల నుండి డౌన్లోడ్ చేసి ఉపయోగించవచ్చు
4)లోగోని మరియు పోస్టర్ ఇమేజెస్ canva,the hotho ,stencil ,Hatchful ,pixlr,fotor ఇంకా ఆన్లైన్ లోగో మేకర్స్ చాలా ఉన్నయి.మనకి ఏది సులువుగా ఉందో వాటిద్వారా డిజైన్ చేసుకోవచ్చు పవర్పాయింట్ లో కూడా లోగో డిజైన్ చేసుకోవచ్చు.
5)వీడియోస్ ని మీ సొంత వీడియో ఐన వేరొకరి యూట్యూబ్ వీడియో ఐనా ఎబ్బెడెడ్ లింక్ ని ఉపయేగించి అప్లోడ్ చేయండి
6)మీ పోస్టును పబ్లిష్ చేసినతర్వాత url లింక్ ఎలావస్తుందో చూసుకోవాలి ఒకవేళ యుఆర్ఎల్ లింక్లో మీరు పెట్టిన హెడ్డింగ్ కాకుండా blog post అని కనపడుతుంటే revert to draft క్లిక్ చేసి పోస్ట్ సెట్టింగ్స్ లో కి వెళ్లి permalink క్లిక్ చేసి custom permalink సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయండి.Revert to draft క్లిక్ చేస్తేనే మీకు ఆ ఆప్షన్ కనపడుతుంది.ఇది మీకు అర్ధం కాకపోతే ఇక్కడ రాసిన ప్రతి పదాన్ని సిస్టమ్ లో చూస్తూ అనుసరిస్తూ ఎడిట్ చేసుకోండి.
7)మీరు రాసే ప్రతి పోస్ట్ ని షెడ్యూల్ చేసుకోండి మరియు పబ్లిష్ చేసిన తర్వాత ఏ డేట్ లో పబ్లిష్ అవుతుందో చూసుకోండి. డేట్ ను కూడా మీరు ఎడిట్ చేసుకోగలరు.
8)అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతిపోస్ట్ పోస్ట్ కు ఎప్పటికప్పుడు labels చేసుకోండి మీ బ్లాగ్ లో పోస్ట్ లు పెరిగే కొద్దీ lables చేయడం మర్చిపోతుంటారు.
మీరు ఈ క్రింద చూపిన వీడియో ద్వారా ఒక బ్లాగ్ పోస్ట్ ని ఎలా రాయాలో గ్రహించగలరు.
మీరు క్లిక్ చేయడం ద్వారా ఇంకా మరిన్ని మీ సందేహాలకు ఉపాయాలను తెలుసుకోగలరు.
టెంప్లేట్లే లేఔట్ అమరిక మరియు యాడ్సెన్స్ గురుంచి బ్లాగర్ డౌట్స్ పార్ట్ 2 లో చూద్దాం.
Good explanation.
ReplyDelete