Breaking

Thursday, May 28, 2020

BLOGGER DOUBTS AND CLARIFICATIONS IN LAYOUT ARRANGEMENT ,TEMPLATE SETTINGS AND ADSENSE -PART 2


బ్లాగర్స్ డౌట్స్ పార్ట్ -2

  • లేఔట్ మరియు టెంప్లేట్ 
  • యాడ్సెన్స్ 

blogger doubts


బ్లాగర్ డౌట్స్ ఎలా ఉంటాయి టెంప్లేట్ మరియు  లేఔట్ అమరిక లో?

బ్లాగ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటారు  పోస్ట్ ల గురించి ఆలోచిస్తున్నారు అదేసమయం లో టెంప్లేట్ మరియు లేఔట్ ఎలా అమర్చుకోవాలి  అనే సందేహం మిమ్మల్ని బిగా ఆలోచింపచేస్తుంది.అసలు టెంప్లేట్ ఏంటి లేఔట్ ఏంటి అనుకుంటారేమో టెంప్లేట్ అంటే ఒక కలర్ ఫుల్ గా వివిధరకాల అమరికలతో  ఉండేది ఈ అమరిక ఆలా కనిపించాలంటే మనం లేఔట్ లో కి వెళ్లి అమరిస్తేనే మనకి ఆలా కనిపిస్తుంది.కొత్తగా బ్లాగ్ మొదలుపెట్టినవారికి అసలు పోస్ట్ రాయాలో టెంప్లేట్ మార్చుకోవాలో ఏమి అర్థంకాని పరిస్థితుల్లో ఉంటారు.మీకు చెప్తే నవ్వొస్తుందేమో నేను ఒక నెలరోజుజులకంటే పైనే ఈ Themes లో కలర్స్ మార్చుకొంటూ గడిపేశాను మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామో ఆలోచించండి సరే మనం డౌట్స్ లో కి వెళ్దాం.

1) సహజం గానే వచ్చిన బ్లాగర్ టెంప్లేట్స్  నే ఉపయోగించవచ్చుకదా ?

👉ఉపయోగించవచ్చు.మీకు కోడింగ్ పరిజ్ఞానం ఉండి మెనూ బార్ మరియు హెడ్డర్ అమర్చుకోగలిగితే మీకు సులభంగానే ఉంటుంది.

2)ఫ్రీ టెంప్లేట్స్ ను ఎక్కడనుండి డౌన్లోడ్ చేసుకోవాలి?
👉గోయాభి,సారా,టెంప్లేట్యర్డ్స్,బి టెంప్లేట్స్  ఇంకా చాలానే ఉన్నాయ్  బ్లాగర్ ఫ్రీ టెంప్లేట్స్ అని వెతకండి చాలానే వస్తాయి 

3)ఒక  టెంప్లేట్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
👉ఈ రోజుల్లో అందరూ మొబైల్స్ లోనే ఇంటర్నెట్ చూసుకుంటున్నారు అందువలన సిస్టెమ్ మరియు మొబైల్ కి రెండింటికి అనువుగా ఉండే టెంప్లేట్ ని ఎంచుకోండి.ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా టెంప్లేట్ అప్లోడ్ చేసినతర్వాత మీ సిస్టెమ్ మరియు మొబైల్ లో రెండింట్లో చూసుకోండి మొబైల్ ఫ్రెండ్లీ టెంప్లేట్స్ కూడా ఉంటాయి వెతకండి.

4)ఫ్రీ టెంప్లేట్స్ Themesలో ఫాంట్ స్టైల్ మరియు కలర్స్ మార్చే అవకాశం ఉంటుందా ?
👉ఉంటుంది కానీ బ్లాగర్ డిఫాల్ట్ టెంప్లేట్స్ లో మార్చుకున్నట్లు ఎక్కడ కావాలంటే అక్కడ మనం కలర్స్ మరియు ఫాంట్ స్టైల్ మార్చలేము.ఈ ఫ్రీ టెంప్లేట్స్ లో పరిమితంగానే మార్చగలము అది టెంప్లేట్ ను బట్టి ఆధారపడి ఉంటుంది.కొన్ని ఫ్రీ టెంప్లేట్స్ లో అసలు ఫాంట్ స్టైల్ మార్చుకోవడానికి ఆప్షన్ అసలు ఉండదు.అది మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకొన్నపుడు గమనించగలరు.ఒకసారి రెండు మూడు టెంప్లేట్స్ అప్లోడ్ చేసుకొని చూడండి ఏం మార్పులు ఉంటాయో మీరే గ్రహించగలరు.

5)ఫ్రీ టెంప్లేట్ డౌన్లోడ్ చేసుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి?
👉మీరు ఎక్కువ సమయం కలర్స్ మార్చుకోకుండా ఫాంట్ స్టైల్ ని మార్చకుండా మీరు మీ సమయాన్ని పోస్ట్ లకు కేటాయిస్తూ సమయాన్ని సేవ్  చేయగలరు ఇది నేను అనుభవం తో రాస్తున్నాను.
👉మెను బార్ లో లింక్ లిస్ట్ అమర్చుకోవాటానికి మరియు హెడ్డర్ ఇమేజ్ ని డిజైన్ చేసుకోవడానికి బాగా సులభం గా ఉంటుంది ఇదే అతి ముఖ్యమైన ప్రయోజనం.

6)బిసినెస్ కోసం ఏ టెంప్లేట్ ను ఎంచుకోవాలి?
👉షాపింగ్ కి సంబంధిత ఫ్రీ టెంప్లేట్స్ కూడా ఉన్నాయ్ చూడండి గోయాబి మరియు సొరలో ఐతే అందులో మీ బిసినెస్ కి ఏది ఎలా మ్యాచ్ అవుతుందో చూసుకోండి.కోడింగ్ పరిజ్ఞానం లేని వారు ఆ టెంప్లేట్స్ లో ఉండే కార్ట్ దగ్గర డాలర్ symbol ని మార్చుకోవాలంటే కష్టం అందువలన కార్ట్ లేకుండా ఉండేవి సెలెక్ట్ చేసుకోవడం వలన మీకు సులభం అవుతుంది.కార్ట్ లేకుండా ఉండే బిసినెస్ టెంప్లేట్స్ కూడా  ఉన్నాయి మీరు గమనించగలరు.అన్ని టెంప్లేట్స్ లను ఒక సారి ప్రివ్యూ చూసుకోండి మీ ఆలోచనలకు ఏది దగ్గరగా ఉందో దాన్ని ఎంచుకోండి.

7)అసలు టెంప్లేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది ఎలా అప్లోడ్ చేసుకోవాలి లేఔట్ ని ఎలా అమర్చుకోవాలి?
👉లేఔట్ ని ఎలా అమర్చుకోవాలో  మీరు ఈ క్రింది వీడియో ద్వారా గ్రహించగలరు 

 చూసారు కదా ఈ వీడియో లో ఎలా టెంప్లేట్ అమర్చుకోవాలో కొన్ని టెంప్లేట్స్  లో పైన హెడ్డర్ బార్ లో Fb,Instagram,Twitter,Pinterest లాంటి ఐకాన్స్ ని డిలీట్ చేయకుండా ఇన్విజిబుల్ లో పెట్టుకొని మీరు సోషల్ మీడియాలలో అకౌంట్స్ క్రియేట్ చేసుకొన్న తర్వాత వాటి సంబంధిత యుఆర్ఎల్ లింక్లను  ఇక్కడ పేస్ట్ చేసి  విజిబుల్ లో పెట్టుకోండి.

2.యాడ్సెన్స్ 

ప్యాషన్ తో బ్లాగ్ రాసినా యాడ్సెన్స్ కి అప్లై చేయకుండా ఉండంకదా !!యాడ్సెన్స్ కి అప్ప్రోవ్ కావాలనే ఉద్దేశం తో జాగ్రత్తలు పాటించుకొంటూ పోస్ట్ లు రాయడం మొదలుపెడదాం .మీరు ముఖ్యం గా 
  • About Us
  • Contact Us
  • Terms and conditions
  • Privacy polices
  • sitemap
  • Disclaimer
ఈ ఐదు పేజెస్ ని క్రియేట్ చేసుకుని మెనూ బార్ లో కనిపించేటట్లు లింక్లిస్ట్ చేసుకోండి.ఇక పోస్ట్ రాయడానికి మనసమయాన్ని కేటాయిస్తూ  మంచి కంటెంట్ ను రాస్తూ యాడ్సెన్స్ కోసం ఎదురుచూద్దాం నేను కూడా మీలాగే ..........హ్యాపీ బ్లాగింగ్ 😊
ఈ గల్లి కింగ్స్ మధ్య క్వీన్ లాగా ఆర్టికల్ రాసినందుకు చాలా హాస్యాస్పదంగా ఉన్నా  బ్లాగింగ్ ఆలోచనలను ఇలా వ్యక్తపరిచినందుకు సంతృప్తికరంగా ఉంది.


బ్లాగర్స్ మాత్రమే  ఏకాగ్రతతో ఈ ఆర్టికల్ ను చదివుంటారు అని ఆసిస్తూ మీ sayloudtelugu👍

No comments:

Post a Comment